Site icon NTV Telugu

నిర్మాతగా స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్!

కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపిస్తున్నారు శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఆయన డాన్స్ చూశాం. ఇప్పుడు ఆయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధర్మపురి’. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశ్వజగత్. ఆ ఊరి ఘడి లో సర్పంచ్ దగ్గర పని చేసే ఓ జీతగాడు.. బీడీ కార్ఖానా లో పనిచేస్తూ బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ‘ధర్మపురి’ చిత్రం. ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కించారు చిత్రయూనిట్. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ మాస్టర్ సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Exit mobile version