Site icon NTV Telugu

Bhojpuri Actor : మహిళా అభిమాని బాడీపై స్టార్ నటుడి చెత్త కామెంట్లు..

Bhojpuri Actor

Bhojpuri Actor

Bhojpuri Actor : ఈ మధ్య సినిమా సెలబ్రిటీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ గా ఉన్నామనే ధ్యాస మర్చిపోయి వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. నిన్న భోజ్ పురి స్టార్ హీరో పవన్ సింగ్ పబ్లిక్ గానే హీరోయిన్ అంజలి నడుమును పదే పదే టచ్ చేశాడు. అది కాస్త తీవ్ర వివాదంగా మారింది. దెబ్బకు అతను సారీ కూడా చెప్పాడు. అంజలి సోషల్ మీడియాలో సంచలన వీడియో పోస్ట్ చేసింది. అతని ప్రవర్తన వల్ల తాను తీవ్ర ఇబ్బంది పడ్డానని.. ఇక నుంచి భోజ్ పురిటో నటించను అని సంచలన ప్రకటన చేసింది. ఇది మర్చిపోక ముందే ఇప్పుడు మరో స్టార్ నటుడు చెండాలమైన పని చేశాడు.

Read Also : Nara Rohith : శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్

పబ్లిక్ గానే ఓ స్టేజిపై మాట్లాడుతూ.. మహిళా అభిమానిని పిలిచాడు. ఆమె రాగానే.. నువ్వు పెద్దామెవా.. చిన్నామెవా అని అడిగాడు. లేదు చిన్నామెనే అని ఆమె చెప్పడంతో.. కానీ నీ బాడీలో ఏదీ చిన్నగా లేదు అంటూ చెప్పండంతో అంతా షాక్ అయ్యారు. దానికి సదరు మహిళా అభిమాని ఒకింత షాక్ కు గురయింది. వెంటనే కవర్ చేస్తూ.. ఆమె హైట్ చూడండి.. ఆమె జుట్టు చూడండి ఏదీ చిన్నగా లేదు అంటూ చెప్పాడు. అయినా సరే ఆయన్ను సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు. ఒక మహిళా అభిమానితో ఇలా ప్రవర్తిస్తావా.. సిగ్గుచేటు అంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై అతగాడు ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి. ఏదేమైనా భోజ్ పురి నటులు ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉన్నారు.

Read Also : Nani : అది తలచుకుంటే నరకంలా అనిపిస్తోంది.. నాని షాకింగ్ కామెంట్స్

Exit mobile version