NTV Telugu Site icon

Vidushi Swaroop: వ్యభిచారం చాలా కూల్.. ఛీ.. సిగ్గులేదు.. నువ్వసలు ఆడదానివేనా

Vidushi

Vidushi

Vidushi Swaroop: ప్రస్తుతం సినిమాల్లో కామెడీ కన్నా.. స్టాండప్ కామెడీ షోస్ ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. పబ్స్, రెస్టారెంట్స్, కేఫ్స్ లలో ఒక చిన్న స్టేజిపై నిలబడి.. సమాజంలో జరుగుతున్న అంశాలపై జోక్స్ వేస్తూ.. ప్రజలను నవ్విస్తున్నారు. అంతెందుకు స్టాండప్ కమెడియన్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటించాడు. అంతలా స్టాండప్ కామెడీ ప్రజల్లో పాతుకుపోతుంది. అయితే.. సమాజంలో అంశాలను తీసుకొని నవ్వించొచ్చు.. కానీ, మహిళలను.. వారి వృత్తులను అవమానించకూడదు. తాజాగా ఒక లేడీ స్టాండప్ కమెడియన్ అందరి ముందు.. వ్యభిచార వృత్తి కూల్ అని ఈజీగా తీసిపడేసింది. ఆమె పేరు విధూషి స్వరూప్. ముంబై లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఫేమస్ స్టాండప్ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది.

Chiranjeevi: రూ. 200 కోట్లు బడ్జెట్.. కుర్ర హీరో విలన్.. నమ్మేలా ఉందా వశిష్ఠ..?

ఇక తాజాగా ఆమె తన షోలో మహిళలను కించపర్చేలా మాట్లాడింది. ” వ్యభిచారం చాలా కూల్ వృత్తి. అనుభవజ్ఞుల కంటే ఫ్రెషర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఏకైక వృత్తి ఇదే. ఈ వృత్తిలో కంపెనీ సీఈవో కంటే ఇంటర్న్ ఎక్కువ డబ్బు సంపాదిస్తారు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక ఆడదానివి అయ్యి ఉండి .. మరొక ఆడదాన్నీ అవమానిస్తున్నావ్.. నువ్వసలు ఆడదానివేనా అని కొందరు.. ఇది అసలు జోక్ లా ఉందా .. చాలా అసహ్యంగా ఉంది అని ఇంకొందరు ఆమెను ఏకిపారేస్తున్నారు. సాధారణంగా ఏ ఆడది ఇలాంటి వృత్తిని ఎంచుకోదు. కూటికి లేక కొందరు.. ఏ పని దొరక్క కొందరు.. అమ్మాయిలను మత్తుమందు ఇచ్చి వ్యభిచారంలోకి దింపితే.. అక్కడ నుంచి బయటకు రాలేక మరికొందరు ఆ రాకెట్ లో చిక్కుకుపోయి జీవనం సాగిస్తున్నారు. అలాంటి వృత్తి ఈమెకు కూల్ గా అనిపిస్తుందా.. ? అని తిట్టిపోస్తున్నారు. నవ్వించడానికి జోక్స్ చెప్పు.. కానీ, ఇలా మహిళలను అవమానించడం సిగ్గుచేటు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments