మరో రెండు రోజుల్లో వింటేజ్ పవర్ స్టార్‌ని చూసి.. ఫ్యాన్స్ కాదు, థియేటర్ స్క్రీన్సే విజిల్స్ వేసేలా ఉన్నాయి. భీమ్లా నాయక్ తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా బ్రో. ఈ గ్యాప్‌ను ఫుల్ ఫిల్ చేసేందుకు వింటేజ్ పవర్ స్టార్‌తో కలిసి.. ఒక అభిమానిగా రచ్చ చేయబోతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన బ్రో ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పవన్ వింటేజ్ స్టైల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే థియేటర్లో రచ్చ చేయడానికి రెండు రోజుల ముందు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ మేనియాను చూసేందుకు రెడీగా ఉండండి.. అంటూ మేకర్స్ ఓ లుక్ విడుదల చేశారు.
దాంతో ఈవెంట్ కోసం వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్. మామూలుగానే మిగతా హీరోల వేడుకల్లో పవర్ స్టార్ పేరు వినిపిస్తే చాలు.. ఈలలు, గోలలతో ఆడిటోరియం దద్దరిల్లిపోతుంది. అలాంటిది పవర్ స్టార్ స్టేజి పైన ఉంటే.. ఆ రచ్చ ఎలా ఉంటుందో, బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్‌తో చెప్పేశాడు రాజమౌళి. ఈ రోజు సాయంత్రం అదే జరగబోతోంది. ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సమయంలో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పవర్ స్టార్ ఎంట్రీ మొదలుకొని, వేదికను విడిచే వరకు.. పవన్ ఆర్మీ చేసే హంగామాను తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. అంతేకాదు.. పవన్ ఇచ్చే పవర్ ఫుల్ స్పీచ్ కోసం వెయిటింగ్ అంటున్నారు అభిమానులు. అయితే పవన్ ఈ ఈవెంట్‌కు వస్తాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ వస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ ఎలాంటి కిక్ ఇస్తాడో చూడాలి.