NTV Telugu Site icon

Bhola Shankar: భోళా శంకర్ సినిమా నిలిపివేత.. థియేటర్ సీజ్

Bhola Shankar Theatre Siezed

Bhola Shankar Theatre Siezed

Bhola Shankar Movie Theater Siezed at Bapatla: మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్, తమన్నా సోదరుడు పాత్రలో సుశాంత్ నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి పెద్దగా అంచనాలు లేవు. అయితే ఎట్టకేలకు ప్రేక్షకులు ముందు వచ్చాక కూడా సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు కూడా అనేక అవాంతరాలు కూడా ఎదురయ్యాయి. ఇలా సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ విశాఖపట్నం కి చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ కోర్టుకు వెళ్లారు.

Jayaprada: బ్రేకింగ్: నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష..ఎందుకంటే?

అయితే కోర్టు నుంచి క్లియరెన్స్ రావడం సినిమా రిలీజ్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక సినిమా థియేటర్ లో భోళా శంకర్ సినిమా ప్రదర్శన నిలిపివేసి ధియేటర్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బాపట్లలోని ఎస్వీఎస్ థియేటర్ లో భోళా శంకర్ సినిమాకి అనుమతి లేకపోయినా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సినిమా నిలిపివేసి థియేటర్ సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేందుకు గాను నిర్మాతలు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలని కోరింది. కానీ నిర్మాణ సంస్థ ఆ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో టికెట్ రేట్లు పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.