సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, విజన్‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాక, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌ని సెట్ చేసింది. ప్రపంచస్థాయి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌తో, ఇప్పటివరకు చూడని స్టైల్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ని గాయకుడు, సంగీత దర్శకుడు కాళభైరవ బయటపెట్టాడు.
Also Read : Drug Case Twist : డ్రగ్స్ కేసులో మరో సెన్సేషన్ – టాలీవుడ్ హీరోలపై ఈడీ విచారణ!
తాజాగా జరిగిన ‘మోగ్లీ’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. “SSMB29 సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ మొదలయ్యాయి. నా నాన్న (ఎం.ఎం.కీరవాణి) ఎప్పుడూ తన ప్రతి సినిమా మ్యూజిక్ ప్రాసెస్‌లో నాకు ఏదో ఒక పని అప్పగిస్తారు. ఈసారి మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో కూడా నాకు బాధ్యత ఇచ్చారు” అని తెలిపారు. ఈ మాటలతోనే మహేష్ అభిమానులు ఉత్సాహంగా మారారు. “మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌కి కీరవాణి మ్యూజిక్ అంటే ఊహించలేనంత మ్యాజిక్ ఖాయం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇక కథ అడ్వెంచర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకి భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో షూటింగ్ చేయనున్నారు. రాజమౌళి గతంలో ఇచ్చిన హింట్స్ ప్రకారం, ఈ సినిమా ‘ఇండియానా జోన్స్’ తరహాలో సాగే అవకాశం ఉంది. మొత్తం మీద, SSMB 29 నుంచి “సౌండ్ మొదలైంది” అని చెప్పిన కాలభైరవ మాటలతో సినిమా బజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అభిమానులందరూ రాజమౌళి–మహేష్ కాంబో నుంచి వచ్చే ఫస్ట్ లుక్, టైటిల్, మ్యూజిక్ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
