సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకదీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి విశేషాలు బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృధా ప్రయత్నమే అని రీసెంట్‌గా షూటింగ్ వీడియో లీక్ అయ్యినప్పుడే అర్థం అయ్యింది. ఈ వీడియో లీక్ అయ్యిన తర్వాత రాజమౌళి తన షూటింగ్ పరిసరాల్లో సెక్యూరిటీని పెంచేశాడట. ఒడిశాలో మొదటి షెడ్యూల్‌ని పటిష్టమైన భద్రత మధ్యలోనే ముగించారట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను ఆ చిత్ర సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి చెప్పుకొచ్చాడు..
Also Read:Surya : ‘రెట్రో’ నుంచి మరో సాంగ్ విడుదల
‘నా టూర్ MMK’ పేరుతో ఈనెల 22న కీరవాణి కాన్సెర్ట్ నిర్వహించబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రొమోషన్స్‌లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్, రాజమౌళి మూవీ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నా సినీ జీవితంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఒక సినిమా రావడం చూడలేదు. ఈ మూవీ జానర్ మాత్రమే అడ్వెంచర్ కాదు, నాకు సంగీతం అందించడం కూడా అడ్వెంచర్ తో కూడుకున్న పని అని చెప్పాలి. చాలా కష్టమైన ప్రయాణం ఇది. కానీ నా మీద పెట్టిన నమ్మకాని నిలబెట్టుకోవాలి. అందుకోసమె సరికొత్త సౌండ్స్‌ని ఈ జానర్ కోసం సృష్టించబోతున్న. ఇది నేను ఛాలెంజ్‌గా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు మూవీ పై మరింత ఆసక్తిని పెంచేశాయి. దీని బట్టి రాజమౌళి ఏమి ప్లాన్ చేసి ఉంటాడో అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.