ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SSMB 29’ కోసం యావత్ భారతదేశం ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతీ చిన్న విషయం కూడా అభిమానుల్లో క్రేజ్ పెంచుతోంది. అయితే సినిమా వివరాలను గోప్యంగా ఉంచడానికి రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, తాజాగా ఒక అరుదైన ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
Also Read : Ghattamaneni : తేజ డైరెక్షన్‌లో.. హీరోయిన్‌గా రమేష్ బాబు కూతురు ఎంట్రీ!
ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పాల్గొన్న ఒక ఫోటో బయటపడింది. ఆ ఫోటోలో మహేష్ బాబు బ్లూ టీ-షర్ట్, గ్రే క్యాప్‌లో స్మార్ట్‌గా కనిపించగా, ప్రియాంక చోప్రా వైట్ అవుట్‌ఫిట్‌లో ఎలిగెంట్‌గా మెరిసింది. ఇద్దరూ కలిసి కెమెరాకు ఫోజులిచ్చిన ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేష్, ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో ఆనందం ఊహించలేనంతగా పెరిగింది. “ఫైనల్‌గా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో చూశాం.. ఇది ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అరుదైన ఫోటో మరింతగా SSMB 29పై అంచనాలను పెంచేసింది. రాజమౌళి విజన్, మహేష్ బాబు మాస్ ఇమేజ్, ప్రియాంక చోప్రా గ్లామర్ – అన్నీ కలిసివస్తే ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్‌లో భారీ హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
