క్లాస్, మాస్ కాదు… మహేష్ బాబుది అదో రకం ఊరమాస్ కటౌట్. చూడ్డానికి క్లాస్‌గా, మిల్క్ బాయ్‌లా కనిపించే సూపర్ స్టార్ ఆన్ స్క్రీన్ యాటిట్యూడ్ మాత్రం మాస్‌కే చెమటలు పట్టించేలా ఉంటుంది. ఒక్కడు, పోకిరి, సినిమాల్లో మహేష్ బాబు చేసిన మాస్ జాతర ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ మధ్యే మహేష్ బాబు కాస్త రూట్ మార్చేశాడు. సోషల్ మెసేజ్ ఓరియెంటేడ్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అందుకే ఘట్టమనేని అభిమానులు ఒక్కడు, పోకిరి లాంటి మహేష్ కావాలంటున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. అతడు, ఖలేజా తర్వాత.. మహేష్ బాబుని మరింత పవర్ ఫుల్‌గా చూపించేందుకు రెడీ అయ్యాడు మాటల మాంత్రికుడు. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా టైటిల్ అండ్ మాస్ స్ట్రైక్‌ను.. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. ఈ రోజు సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ రీ రిలీజ్ థియేటర్లో.. అభిమానులే అతిథులుగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
యూట్యూబ్‌లో 6 గంటల 39 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. మాస్ స్ట్రైక్ వీడియోని 63 సెకన్లుగా లాక్ చేశారు. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాను టేకోవర్ చేసేసుకున్నారు. ఈ 63 సెకన్ల వీడియోతో.. ప్రతి ఫ్రేమ్ రికార్డ్ క్రియేట్ చేసేలా అంతా సెటప్ చేసుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ తో సోషల్ మీడియాలో టీం “SSMB 28′ మామూలుగా రచ్చ చేయడం లేదు. తలకు హెడ్ బ్యాండ్, చేతిలో బీడి మహేష్ ఫ్యాన్స్‌ను తెగ టెంప్ట్ చేస్తోంది. వన్స్ మాస్ స్ట్రైక్ వీడియో సోషల్ మీడియాలో పడితే చాలు… లైక్స్, వ్యూస్‌తో రికార్డులు లేస్తాయ్ అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతానికైతే.. ‘ఇది మీకోసమే నాన్న’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి మాస్ స్ట్రైక్‌తో మహేష్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
LOCKED, LOADED & READY FOR BLAST! 🔥 #SSMB28#SSMB28MassStrike with title reveal 🤩
Remembering our Superstar Krishna garu on his Birth Anniversary! ✨ pic.twitter.com/8sa7lpBfY2
— Naga Vamsi (@vamsi84) May 30, 2023
