సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉండగా, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన స్ట్రాటజీని రిపీట్ చేయబోతున్నాడని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం మహేష్ కోసం రాజమౌళి సమంతను రంగంలోకి దింపుతున్నాడట. అయితే నిజానికి రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడు. ఒక్క అనుష్కతోనే రాజమౌళి మూడు సినిమాలు చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు, బాహుబలి చిత్రాలలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇక గతంలో రాజమౌళి చేసిన ‘ఈగ’ సినిమాలో సామ్ కన్పించిన విషయం తెలిసిందే.
Read Also : తెలంగాణ ఆర్టీసీ దెబ్బకు దిగివచ్చిన రాపిడో !
ఇప్పుడు మరోసారి మహేష్, రాజమౌళి కాంబోలో రానున్న సినిమా కోసం హీరోయిన్ గా సమంత పేరు విన్పిస్తుండడం ఆసక్తికరంగా మారింది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రాజమౌళి హీరోయిన్లను రిపీట్ చేయకపోవడం, రెండోది పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రాజమౌళి అసలు సౌత్ హీరోయిన్ ను తీసుకుంటాడా? అనే అనుమానం. “ఆర్ఆర్ఆర్” సినిమా కోసం బాలీవుడ్, హాలీవుడ్ భామలను తీసుకొచ్చిన సంగతి విదితమే. మరి ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ కోసం సౌత్ హీరోయిన్ ను తీసుకోవడం అనేది డౌటే.
ఇదిలా ఉండగా గతంలో సమంత, మహేష్ బాబు ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దూకుడు, బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో వీరిద్దరి జంట ప్రేక్షకులను అలరించింది. మరి మరోసారి వీరు జోడి కడతారా? ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో ఉత్తరాదిన సైతం సమంత మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆమె నెక్స్ట్ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. మరి ప్రచారం జరుగుతున్నట్టుగా రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సామ్ ను ఎంచుకుంటాడా ? మరోసారి మహేష్, సామ్ కాంబో పాన్ ఇండియా లెవెల్ లో ఆకట్టుకుంటుందా ? అనేది వేచి చూడాలి.
