మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” అందరు నన్ను అడుగుతూ ఉంటారు.. ఇంత సక్సెస్ అందుకున్న అంత హంబుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు అని.. ఒక్కసారి చిరంజీవి గారిని చూడండి. ఆయన నుంచి నేర్చుకున్న వాటిలో హంబుల్ నెస్ ఒకటి.. ఎంత ఎదిగినా హంబుల్ గా నేల మీద నిలబడడం ఆయన నుంచే నేర్చుకోవాలి. డైరెక్టర్ కి ఎంత విజన్ ఉన్నా.. ఎంత బాగా చూపించాలనుకున్నా మంచి టెక్నీషియన్స్ లేకపోతే అది జరగదు. కానీ ఆచార్య విషయంలో అంతా పర్ఫెక్ట్ గా జరిగింది. అన్నపూర్ణలో నేను కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఆచార్య సాంగ్స్ని చూశాను. ఆ కలర్ టోన్ కానీ, ఆ రిచ్ నెస్ కానీ, లైటింగ్ ప్యాట్రన్ కానీ చాలా అద్భుతంగా తిరు గారు చూపించారు.
మణిశర్మ గారి సాంగ్స్ ఎన్నిసార్లు ప్లే చేసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇక చరణ్ గురించి మూడు నెలలుగా మాట్లాడుతూనే ఉన్నాను. నేను మగధీర టైమ్ లో చిరంజీవి గారు కథ విన్నారు. నేను అనుకున్నాను అప్పుడు చిరంజీవి గారు చరణ్ ని దగ్గర ఉండి చూసుకుంటున్నారు అని .. కనై చిరంజీవి గారు ఎప్పుడు చరణ్ కు చెప్పరు. అన్నీ చరణ్ ఒక్కడే చూసుకుంటాడు.. మధ్యలో తప్పులు చేస్తే తనే సరిదిద్దుకొని తానే నేర్చుకున్నాడు. డైరెక్టర్ చెప్పినదాంట్లో కొత్తవి నేర్చుకొని తనుగా ఎదిగాడు . మెగాస్టార్ కొడుకు అయ్యిండొచ్చు కానీ ఇప్పుడు చరణ్ ఇలా ఉన్నాడు అంటే అది తన హార్డ్ వర్క్ మాత్రమే.. ఏదో ఒకరోజు చిరంజీవి గారి అంత కాకపోయినా ఆ రేంజ్ కు కి నువ్వు ఎదుగుతావ్.. అది నాకు నమ్మకం ఉంది. ఇంకా చెప్పాలంటే సి ఒక ఫ్యాన్ గా చిరంజీవి గారి కన్నా ఒక డైరెక్టర్ గా నాకు నా హీరో చరణ్ అంటేనే ఇష్టం. ఇక చిరు గారి లో నచ్చిన మరో లక్షణం కొడుకు పక్కన ఉన్న ఆయనే డామినేట్ చేయాలనే విధానం చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఇక శివగారు అన్ని చూస్తూ ఉంటారు. మిర్చి సినిమా వచ్చినప్పుడే ఒక మంచి మాస్ డైరెక్టర్ వచ్చాడని అనుకున్నాం. ఇక ఈ సినిమా గురించి నేను విష్ చేయడం లేదు.. నమ్మకంగా చెప్తున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు.
