Site icon NTV Telugu

SS Rajamouli: మీడియాకి రాజమౌళి క్షమాపణలు.. ఎందుకంటే?

Ss Rajamouli On Visiting Temples

Ss Rajamouli On Visiting Temples

SS Rajamouli Says Sorry to Media for Being Late: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు తెలుగు అనే కాదు యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గొప్ప సినిమాలుగా నిలిచాయి. బాహుబలి 2 సినిమా అయితే ఒక అడుగు ముందుకేసి ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది. అయితే, అంతటి ఘన విజయం సాధించిన బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో రాజమౌళి ఓ యానిమేటెడ్ సిరీస్ తీసుకొస్తున్నారు. బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఇక ఈ యానిమేటెడ్ సిరీస్ కోసం మీడియా ముందుకు వచ్చారు దర్శకుడు రాజమౌళి. ఈ సిరీస్ లోని మొదటి రెండు ఎపిసోడ్స్ ను ప్రీమియర్ గా మీడియా కోసం ఏఎంబీలో ప్రదర్శించారు. ఇక దీని కోసం ఢిల్లీ, ముంబై నుంచి మీడియా ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు.

Chandrabose – RP: చంద్రబోస్, ఆర్పీలకి కొత్త బిరుదులు.. ఏమంటే?

ఇక ఈ క్రమంలో మీడియా ప్రతినిధి ఒకరు రాజమౌళిని ప్రశంసిస్తూనే ఇన్నేళ్లల్లో ఎప్పుడూ లేని విధంగా ఎందుకు లేట్ చేశారు? మీకు తెలిసి జరిగిందా? లేదా మీకు ఇచ్చిన సమాయనికే వచ్చారా? అని ప్రశ్నించారు. దానికి ఆయన తనకు ఇచ్చిన సమయానికి తాను వచ్చానని, ఐదున్నరకు రమ్మన్నారు ఐదున్నరకు వచ్హానని అన్నారు. అయితే ఈ ఆలస్యం వలన ఇబ్బంది పడితే సారీ అంటూ కామెంట్ చేశారు. ఇక బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ మే 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ కానుంది. ఇక ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లోనూ ఈ సిరీస్ మే 17న హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో రానుందని ప్రకటించారు మేకర్స్.

Exit mobile version