Site icon NTV Telugu

SS Rajamouli: తారక్, చరణ్‌ల కన్నా.. నేను ఎక్కువగా నాటు నాటు స్టెప్పులేస్తున్నా

Jakkanna On Naatu Naatu

Jakkanna On Naatu Naatu

SS Rajamouli Reacts On Naatu Naatu Oscar Nominations: ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న విషయం తెలిసిందే! దీనిపై ట్విటర్ మాధ్యమంగా దర్శకధీరుడు రాజమౌళి ట్విటర్ మాధ్యమంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన పెద్దన్నయ్య ఎంఎం కీరవాణి ఆస్కార్ నామినేషన్ పొందినందుకు తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని.. తారక్, చరణ్‌ల కన్నా తానిప్పుడు నాటు నాటు స్టెప్పులను నాటుగా వేస్తున్నానని పేర్కొన్నాడు. అలాగే.. తన చిత్రబృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Naatu Naatu For Oscars: నాటు దెబ్బ డైరెక్ట్ ఆస్కార్స్‌కే.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

‘‘నా సినిమాలో తాను కంపోజ్ చేసిన పాటకు మా పెద్దన్నయ్య (కీరవాణిని ఉద్దేశించి) ఆస్కార్ నామినేషన్ పొందాడు. ఇంతకన్నా నాకేం వద్దు. ఇప్పుడు నేను చరణ్, తారక్‌ల కన్నా నాటుగా నాటు నాటు స్టెప్పులు వేస్తున్నా. మన పాట ఆస్కార్ స్టేజ్ మీద వెళ్లినందుకు చంద్రబోస్‌కు శుభాకాంక్షలు. ప్రేమ్ మాస్టర్‌ ఈ పాటకు అందించిన సహకారం విలువ కట్టలేనిది. నా పర్సనల్ ఆస్కార్ మీకే. భైరవ ఇచ్చిన బీజీఎమ్ స్ఫూర్తితోనే నాటు నాటు తీయాలని నిర్ణయించుకున్నా. అందుకు భైరి బాబుకి ధన్యవాదాలు. రాహుల్, భైరవ పాడిన తీరు ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక తారక్, చరణ్‌లు ఈ పాటకు వేసిన స్టెప్పులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. వారి వల్లే ఈ పాటకి ఇంత గుర్తింపు దక్కింది. మీ ఇద్దరిని టార్చర్ పెట్టినందుకు సారీ, కానీ మళ్లీ టార్చర్ పెట్టడంలో అభ్యంతరం చెందను’’ అంటూ జక్కన్న ట్వీట్ చేశాడు.

Tragedy : రాత్రి లేటుగా వచ్చిన భర్త.. తలుపు తీయని భార్య.. కట్ చేస్తే..

అంతేకాదు.. తాను కలలో కూడా ఆస్కార్ వరకు వెళ్తానని అనుకోలేదని.. ఈ సినిమా, నాటు నాటు అభిమానుల ఆస్కార్స్‌కు వెళ్తామని నమ్మారని, ఆ నమ్మకమే తమని ముందుకు నడిపించిందని, అందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలని జక్కన్న తెలిపాడు. కార్తికేయ పడిన కష్టానికే ఈ ఫలితం దక్కిందన్నాడు. ఇక ప్రదీప్, హర్ష, చైతన్య కంటి మీద కునుకు లేకుండా 24×7 షూటౌట్స్ ఇచ్చారని.. అందుకు వారికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువేనన్నాడు. తామింకా ఒక్క అడుగులో మాత్రమే దూరం ఉన్నామని జక్కన్న చెప్పుకొచ్చాడు.

Exit mobile version