SS Rajamouli and Mahesh Babu to Conduct a Joint Pressmeet: ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకధీరుడు రాజమౌళి తన తరువాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా… అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో రోజుకో వార్త ఈ సినిమాపై పుట్టుకొస్తుంది. వీటన్నిటికీ బ్రేకులు వేసేలా త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రెస్ మీట్ తరహాలోనే మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాత కె ఎల్ నారాయణ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టనున్నారట. ఇక ఈ ప్రెస్ మీట్ లోనే అధికారికంగా ఈ సినిమా గురించి చెప్పనున్నారని తెలుస్తోంది. ఆ రోజే సినిమా టైటిల్ లేదా వర్కింగ్ టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పనులు పూర్తికాగా మరో పేరు SSRMB అనే వర్కింగ్ టైటిల్ కూడా అనధికారికంగా ప్రచారంలో ఉంది.
ఇక ఈ ప్రెస్ మీట్ అనంతరం ఇక మహేష్ బాబు కూడా ఓ యాడ్ షూట్ లో బిజీగా ఉండనున్నారని సమాచారం. ఇక ఆ యాడ్ షూటింగ్ లోనే మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ యాడ్ షూటింగ్ తర్వాత పూర్తిగా జక్కన్న అధీనంలోకి మహేష్ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక జక్కన్న సూచనల మేరకు మహేష్ బాబు తన బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టి.. మీడియాకు, కెమెరాలకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. దీనికి కారణం రాజమౌళి పెట్టిన కండిషన్స్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్క్రిప్టింగ్ జరుగుతుండగా ఈ మే నెలలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రానుంది. ఈ మూవీలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు నటులు నటించనున్నారని ప్రచారం అయితే జరుగుతోంది.