NTV Telugu Site icon

Fahad Faasil: ఫహద్ ఫాజిల్ హీరోగా రెండు సినిమాలు ప్రకటించిన జక్కన్న కొడుకు

Ss Karthikeya Fahad

Ss Karthikeya Fahad

SS Karthikeya Announces two movies with Fahad Faasil as Producer: రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. ఈ మేరకు ఆయన ఒక పోస్ట్ కూడా రాసుకొచ్చారు. రెండేళ్ల క్రితం కొత్త కుర్రాడు సిద్ధార్థ్ నాదెళ్లతో స్ఫూర్తిదాయకమైన ఫ్రెండ్‌షిప్ సబ్జెక్ట్‌పై పనిచేస్తున్నప్పుడు, మరో థ్రిల్లింగ్ ఫాంటసీ కథ అకస్మాత్తుగా మరో కొత్త కుర్రాడు శశాంక్ ఏలేటి ద్వారా మా దగ్గరకు వచ్చింది. విన్న వెంటనే అది కూడా మమ్మల్ని అంతే ఎగ్జైట్ చేసింది. ఇలా రెండు కథలు మా దగ్గరకు వచ్చినప్పటికీ ఈ రెండు స్క్రిప్ట్‌ల కోసం ఇద్దరూ ఒకే నటుడి వద్దకు వెళ్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. అలాగే మొదటి నేరేషన్ లోనే అంగీకరిస్తాడని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎవరినైతే నేను చాలా కాలంగా ఆరాధించానో, బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపమో ఆయనే ఫహద్ ఫాసిల్ అంటూ ఆయన రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో కలిసి రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు కార్తికేయ.

Mercy Killing: హీరోయిన్ గా జబర్దస్త్ భామ.. “మెర్సి కిల్లింగ్” చేయమంటోంది!

ఈ రెండు సినిమాలలో ఫహద్ ఫాసిల్ హీరోగా నటిస్తూ ఉండటం గమనార్హం. సిద్ధార్థ్ నాదెళ్లతో ఫహాద్ ఫాజిల్ ఆక్సిజన్ అనే సినిమా చేయనుండగా ప్రశాంత్ ఏలేటి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే పేరుతో ఒక సినిమా చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మలయాళ సినిమాని కొనుగోలు చేసి తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశాడు కార్తికేయ. ప్రేమలు పేరుతో మలయాళం లో సూపర్ హిట్గాంచిన సినిమాని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ గా నిలిచి మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పుడు అదే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన టాప్ హీరోతో రాజమౌళి కొడుకు రెండు సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. ఫహద్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాలను మలయాళ తెలుగు భాషల్లో రిలీజ్ చేయడం కన్ఫామ్. మరి పాన్ ఇండియన్ రిలీజ్ కి వెళతారో లేదో చూడాలి.

Show comments