NTV Telugu Site icon

Srujana: సృజనా తిన్నావారా.. వదిలేస్తున్నావా ఆడియో గుర్తుందా.. ఆ సృజన ఈ అమ్మాయే

Srujana

Srujana

Srujana: సృజనా తిన్నావారా .. వదిలేస్తున్నావా.. ఎంత నమ్మాను నేను.. నన్ను మోసం చేయాలనీ ఎలా అనిపించిందే అంటూ ఒక ప్రేమికుడు తన ప్రియురాలితో ఫోన్ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు ఎక్కడ చూసినా సృజనా.. సృజనా .. చివరికి ఫోన్ కాలర్ ట్యూన్ గా కూడా సృజనా తిన్నవారా అనే సాంగ్ వినిపించేది. కొన్ని సినిమాల్లో ఇదే వర్డ్ ను కామెడీ కింగ్స్ కూడా వాడేశారు. ఇక ఇంత సెన్సేషనల్ అయినా అసలు ఆ సృజన ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు చాలామందికి తెలియదు.

ఇక తాజాగా ఒక షో పుణ్యమా అంటూ ఆ సృజన ఎవరో బయటపడింది. ఈమె సృజన అంటూ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ ఆడియో నిజం కాదు.. కేవలం వ్యూస్ కోసమే చేసాం అని సదురు యువతి అప్పట్లోనే బయటికొచ్చి చెప్పింది కానీ, అది చాలామంది నమ్మలేదని టాక్. ఏదిఏమైనా ఇన్నేళ్ల తరువాత ఈ ప్రోగ్రామ్ ద్వారా మరోసారి సృజనా తిన్నావారా హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ అమ్మాయి కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ ప్రోమో చూసినవాళ్లందరూ సృజన ను తీసుకొచ్చారు.. సృజనా తిన్నావారా అని అడిగినవాడు ఎక్కడ..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.