ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హీరోగానూ పలు చిత్రాలలో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే శ్రీనివాసరెడ్డి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రం విడుదలైంది. ‘ప్లాన్ బి’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో అతను కీలక పాత్ర పోషించిన మరో సినిమా ‘హౌస్ అరెస్ట్’ ఈ నెల 27న విడుదల కాబోతోంది. సినిమా పంపిణీ రంగంలో ఉన్న కె. నిరంజన్ రెడ్డి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలియత్నంగా ‘హౌస్ అరెస్ట్’ మూవీని నిర్మించారు. ’90 ఎం. ఎల్.’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్రా దీనికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో శ్రీనివాసరెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషించగా రవిబాబు, ‘అదుర్స్’ రఘు, రవిప్రకాశ్, తాగుబోతు రమేశ్, ఫ్రస్టేటెడ్ సునైన, కౌశిక్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయమని కొందరు సలహా ఇచ్చినా, కాదని థియేట్రికల్ రిలీజ్ కే తాము సిద్ధపడ్డామని నిర్మాత తెలిపారు. ఈ నెల 27న ఈ వినోదాత్మక చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి జె. యువరాజ్ సినిమాటోగ్రఫీని అందించారు.
ఈ నెలాఖరులో శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ‘హౌస్ అరెస్ట్’!
