NTV Telugu Site icon

Dj Tillu 2: టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట..?

Srileela

Srileela

Dj Tillu 2: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. సిద్ధూను స్టార్ హీరోగా మార్చేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంతో హీరోయిన్ నేహా శెట్టి మొదటి హిట్ ను అందుకొంది. డీజే టిల్లు గర్ల్ ఫ్రెండ్ రాధిక గా నేహా నటన అద్భుతమని చెప్పాలి. ఇక ఈ చిత్రం హాట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు సిద్దు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిపోయిందని టాక్ నడుస్తోంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా దర్శకుడు విమల్ ప్లేస్ లో కొత్త దర్శకుడు వచ్చాడని రూమర్స్ కూడా వినిపించాయి. వీటిపై మేకర్స్ కానీ, హీరో కానీ స్పందించింది లేదు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే గత కొన్నిరోజుల నుంచి ఈ సీక్వెల్ లో హీరోయిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు రాధిక ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఇప్పుడు అనుపమ కాదని, డీజే టిల్లు సీక్వెల్ లో సిద్ధూ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల నటిస్తున్నదని చెప్తున్నారు. మొదటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మడు ఆ సినిమాతో వరుస అవకాశాలను అందిపుచ్చుకొంటుంది. ప్రస్తుతం ఈ భామ ధమాకా లో రవితేజ సరసన నటిస్తుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అప్పుడే డీజే టిల్లు 2 లో ఛాన్స్ పట్టేసిందంట. కథ నచ్చడంతో ముద్దుగుమ్మ ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి శ్రీలీల.. రాధిక అంత పేరు తెచ్చుకొంటుందో లేదో చూడాలి.