Site icon NTV Telugu

Sreeleela : శ్రీలీల గొప్ప మనసు.. మరో పాపను దత్తత తీసుకున్న హీరోయిన్..

Sree Leela

Sree Leela

Sreeleela : హీరోయిన్ శ్రీలీల మరోసారి గొప్ప మనసు చాటుకుంది. మరో పాపను దత్తత తీసుకుంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రీసెంట్ గా కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. పుష్ప-2లో ఐటెం సాంగ్ తర్వాత మళ్లీ జోష్ పెంచేసింది. వరుసగా ఆఫర్లు రావడంతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది. ఇలా ఎంతో బిజీగా ఉండే శ్రీలీలకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. బ్యూటిఫుల్ గా ఉండే శ్రీలీల.. తన మనసు కూడా అంతే బ్యూటిఫుల్ అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలను శ్రీలీల దత్తత తీసుకుంది.
Read Also : Chiranjeevi : ‘ఠాగూర్’ మూవీ జోడి రిపీట్ చేస్తున్న అనిల్ రావిపుడి..!

ఆమె గతేడాది ఓ ఆశ్రమంకు వెళ్లింది. అక్కడ దివ్యాంగులు అయిన గురు, శోభిత అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. ప్రస్తుతం వారి ఆలనా, పాలన అన్నీ శ్రీలీల చూసుకుంటోంది. తాజాగా మూడో పాపను దత్తత తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టేసింది శ్రీలీల. ఇందులో పాపకు ముద్దు పెడుతూ దిగిన ఫొటోలను పంచుకుంది. మా ఫ్యామిలీలోకి మరొకరు వచ్చారు. మా హృదయాలను నింపేందుకు ఈ పాప వచ్చింది అంటూ రాసుకొచ్చింది శ్రీలీల. ఈ పోస్టు చూసిన వారంతా ఆమెను అభినందిస్తున్నారు. అనాథ పిల్లలను ఆదరిస్తున్న శ్రీలీలను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఆమె మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version