సీనియర్ హీరోయిన్ ఊహ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఆమె పిల్లి కళ్ళు, అమాయకత్వంతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఊహ అప్పట్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. అయితే టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఊహ – శ్రీకాంత్ కూడా ఒకరు. వీరికి ఓ కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఇప్పటికే పెద్ద కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ప్రజంట్ సీనియర్ హీరోయిన్ లు అంతా సినిమాల్లో, సీరియల్ కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఊహ మాత్రం ఇంటికే పరిమితం అయింది. చివరగా తన కొడుకు మొదటి చిత్రం ఈవెంట్ లో పాల్గొన్నప్పటికీ. బయట ఎక్కవగా కనిపించదు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తన భార్య ఊహ రీ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు..
‘ఊహ కి ప్రస్తుతం నటన పై ఇంట్రస్ట్ లేదు. మామూలుగా ఇంటర్వ్యూ లకు రమ్మంటే బతిమిలాడితే తప్ప రాదు. మొన్న కూడా మా అబ్బాయి రోషన్ ఫస్ట్ మూవీ అని వాడి కోసం వచ్చింది . లేకపోతే అసలు తను ఎక్కడికి రాదు. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్ అంటారా . ప్రస్తుతానికి ఇల్లు పిల్లలు లైఫ్ హ్యాపీ గా సాగుతుంది. దీంతో తనకు వేరే వాటిపై ఇంట్రెస్ట్ రావడం లేదు. ఒక వేల తను రీ ఎంట్రీ ఇచ్చిన కూడా ఎవ్వరు ఆప్పరు.’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన తనయుడు రోషన్ సినీ కెరీర్ గురించి కూడా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.