న్యాచురల్ స్టార్ నానిని మాస్ హీరో నానిగా మార్చిన సినిమా ‘దసరా’. విడుదలైన 12 రోజుల్లోనే 110 కోట్లు కొల్లగొట్టిన దసరా సినిమా నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెకండ్ వీక్ లో కూడా బుకింగ్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తున్న దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. మిగతా భాషల్లో ఏమో గానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాసుల వర్షం కురిపిస్తునే ఉంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో దసరా మూవీ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తోంది. తెలంగాణ నెటివిటి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఈరోజుకీ దసరా సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు అంటే దానికి కారణం శ్రీకాంత్ ఓదెల అనే చెప్పాలి. డెబ్యూ డైరెక్టరే అయినా ‘దసరా’ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశాడనే కాంప్లిమెంట్స్ శ్రీకాంత్ అందుకున్నాడు. ఫస్ట్ టైం నానిని రగ్గ్‌డ్ క్యారెక్టర్లో చూపించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. అందుకే నిర్మాత సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెలకి ఏకంగా 80 లక్షల బీఎండబ్ల్యూ కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడు.
మొత్తంగా ఫస్ట్ సినిమాతోనే దర్శకుడిగా వంద కోట్ల కలెక్షన్స్ తో పాటు కమర్షియల్ దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ ఓదెల, అందుకే ఇతనికి ఇండస్ట్రీలో గిరాకీ పెరిగింది. దీంతో ఈ యంగ్ టాలెంట్‌కు బడా ప్రొడక్షన్ బ్యానర్స్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కినేని కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. శ్రీకాంత్ డైరెక్షన్‌లో అఖిల్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే అఖిల్‌కు శ్రీకాంత్ స్టోరీ నరేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 28న ఏజెంట్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో మీటింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరినే నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుందని టాక్. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా.. లేదా పుకార్లకే పరిమితమవుతుందో చూడాలి.
