Site icon NTV Telugu

తాప్సీ సినిమాకి దర్శకుడు మారాడా?

బాలీవుడ్​లో వరుస చిత్రాలతో బిజీగా మారింది స్టార్​ హీరోయిన్​ తాప్సీ. సవాళ్లు విసిరే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్​ క్రీడాకారిణి మిథాలీ రాజ్​ జీవితకథతో ‘శభాష్​ మిథు’ చిత్రం తెరకెక్కుతోంది. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా డైరెక్టర్‌ను మార్చినట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ తాజాగా సమాచారం మేరకు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్ ముఖర్జీ ఎంటరయ్యారట. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కాబోతోన్న తరుణంలో దర్శకుడు మార్పు వార్తలు బిటౌన్ లో చర్చకు తెరలేపాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ప్రస్తుతం తాప్సీ నటించిన ‘రష్మీ రాకెట్’, ‘లూప్ లపేటా’చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Exit mobile version