Site icon NTV Telugu

“శ్రీదేవి సోడా సెంటర్”కు మహేష్ సాయం

Sridevi Soda Center Trailer launch by Super Star Mahesh Babu on 19th August

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఇప్పుడు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రేపు (ఆగస్టు 19) ఉదయం 10 గంటలకు “శ్రీదేవి సోడా సెంటర్” థియేట్రికల్ ట్రైలర్‌ను మహేష్ ఆవిష్కరిస్తున్నారు. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ చాలా పాజిటివ్‌గా ఉంది. మహేష్ ప్రమోషన్లలో చేరడంతో సినిమాపై హైప్ మరింతగా పెరుగుతుంది.

Read Also : సూర్యకు షాకిచ్చిన హైకోర్టు… పన్నులు చెల్లించాల్సిందే !

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా , ఆనంది శ్రీదేవిగా కనిపించబోతోంది.

Exit mobile version