Site icon NTV Telugu

“శ్రీదేవి సోడా సెంటర్ ” రిలీజ్ డేట్ ఫిక్స్

Sridevi Soda Center gets release date Announcement

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రం చేస్తున్నారు. సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకుందువటే” చిత్రం భారీ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి “శ్రీదేవి సోడా సెంటర్‌”పై ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలతో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. మ్యూజిక్ కంపోజర్ మణి శర్మ ఈ డ్రామాకు సంగీతం అందించారు. ఈ రోజు “శ్రీదేవి సోడా సెంటర్” మేకర్స్ కొత్త పోస్టర్‌ ద్వారా సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. “శ్రీదేవి సోడా సెంటర్ ఆగస్టు” 27న థియేటర్లలో విడుదల కానుంది.

Read Also : వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ

సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. వారితో పాటు ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, నరేష్, మోనోజిత్ శిల్, అరిపిరాల సత్యప్రసాద్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త సహాయక పాత్రలు పోషిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్‌”కు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు.

Exit mobile version