Site icon NTV Telugu

బుల్లితెరలో ‘శ్రీదేవి సోడా సెంటర్’…!

సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆగస్ట్ 27వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా… ఆ తర్వాత నవంబర్ 5వ తేదీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మ్యూజికల్ హిట్ కావడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలూ పొందింది. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుధీర్ బాబు మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది. అలానే నరేశ్ సైతం అత్యుత్తమ నటన కనబరిచాడు. ఇప్పుడీ సినిమా డిసెంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది. థియేటర్లలో, ఓటీటీలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ను మిస్ అయిన వాళ్లు బుల్లితెర లో వీక్షించొచ్చని నిర్మాతలు విజయ్ చిల్లా, శశీ దేవిరెడ్డి చెబుతున్నారు.

Exit mobile version