కంటెంట్ ని మాత్రమే నమ్మి సినిమాలు చేస్తూ, పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో ‘శ్రీ విష్ణు’. నాని తర్వాత అంతటి కూల్ ఇమేజ్ ఉన్న హీరో శ్రీ విష్ణు మాత్రమే. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి మార్కెట్ మైంటైన్ చేసే వరకూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు. స్క్రిప్ట్ ని మాత్రమే నమ్మి సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీ విష్ణు నటించిన గత పది సినిమాల్లో హిట్ అయ్యింది మూడు మాత్రమే. ఒకప్పుడు హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసిన శ్రీవిష్ణు, ఇప్పుడు ఫ్లాప్ స్ట్రీక్ ని మైంటైన్ చేస్తూనే ఉన్నాడు. కథల్లో విషయం లేకపోవడమే శ్రీవిష్ణుని ఇబ్బందులు పెడుతోంది. 2022లో రెండు సినిమాలు చేసిన శ్రీవిష్ణు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి, రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు.
ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ చెయ్యడానికి, తన ఫార్ముల అయిన ఫ్యామిలీ, ఫన్, లవ్, ఎంటర్తైన్మెంట్ కి శ్రీవిష్ణు కంబ్యాక్ ఇస్తున్నట్లు ఉన్నాడు. ఏకే ఎంటర్తైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సామజవరగమన’ అనే సినిమాలో శ్రీ విష్ణు హీరోగా చేస్తున్నాడు. బిగిల్ సినిమాలో యాసిడ్ పడిన ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబా జాన్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి గతంలో శ్రీవిష్ణు పుట్టిన రోజు సంధర్భంగా మేకర్స్, గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమించుకున్న ప్రతి ఒక్కరికీ కాస్ట్ ప్రాబ్లమ్స్, లేదా మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నాకేంటి ఈ సమస్య వచ్చింది అంటూ శ్రీవిష్ణు తనదైన యాసలో డైలాగ్ చెప్పిన విధానం నవ్వించింది. గ్లిమ్ప్స్ లో శ్రీ విష్ణుకి ఎదో ప్రాబ్లమ్ ఉంది అనే హింట్ ఇస్తూ ఆడియన్స్ లో మంచి క్యురియాసిటీ క్రియేట్ చేశారు. ఈ క్యురియాసిటిని మరింత పెంచుతూ మేకర్స్ సామజవరగమనా సినిమా టీజర్ రిలీజ్ కి రెడీ అయ్యారు. ఏప్రిల్ 27న ఉదయం 11:07 నిమిషాలకి AMB సినిమాస్ లో ఈ టీజర్ లాంచ్ జరగనుంది. మరి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ అయినా శ్రీవిష్ణు ఫ్లాప్ స్ట్రీక్ కి బ్రేక్ వేస్తుందేమో చూడాలి.
Memu ready, Mari meeru..?🤩
The Hilarious #Samajavaragamana Teaser releasing TOMORROW👍
📍 @amb_cinemas
⏰ 11:07AMGet ready to be entertained😃@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @AKentsOfficial @AnilSunkara1 @RajeshDanda_ @GopiSundarOffl @ChotaKPrasad pic.twitter.com/V9OLVwZniU
— Hasya Movies (@HasyaMovies) April 26, 2023
