Site icon NTV Telugu

Simha Koduri: ఆకాశం నీ హద్దు ‘ఉస్తాద్’…

Simha Koduri

Simha Koduri

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి, ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని ఫనిదీప్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Read Also: Ashika Ranganath: ఆ పిల్ల చాలా హాట్ గురూ…

ఫిబ్రవరి 23న సింహా కోడూరి పుట్టిన రోజు కావడంతో దర్శక నిర్మాతలు ‘ఉస్తాద్’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. “Meet the fearless pilot who overcame turbulence to give wings to his dreams, from a small town to the sky. Happy birthday to our hero” అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సింహా కోడూరి, పైలట్ గా కనిపించాడు. త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఉస్తాద్ మూవీకి, ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ ని ఇచ్చింది. మరి తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలతో ఆశించిన స్థాయిలో అట్రాక్ట్ చెయ్యలేకపోయిన శ్రీ సింహా కోడూరి ‘ఉస్తాద్’ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.

Exit mobile version