యాంకర్ టర్న్డ్ ఆర్టిస్ట్ అనసూయ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఫోటోలు, ఒకసారి సెన్సేషనల్ కామెంట్స్ తో ట్రెండ్ అయ్యే అనసూయ ఈసారి మాత్రం ఒక వీడియోతో ట్రెండ్ అవుతోంది. అనసూయ ఏడుస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా, నెగిటివిటీ కారణంగా అనసూయ ఏడుస్తుంది అంటూ కొందరు అనసూయ వీడియోని వైరల్ చేసారు. దీంతో తాను సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల బాధపడుతున్న మాట వాస్తవమే కానీ ఆ విషయంలో అయితే ఏడవట్లేదు అంటూ మరో వీడియో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చేసింది అనసూయ. ఈ రెండు వీడియోలని పెట్టి కొందరు అనసూయ టార్గెట్ చేస్తూ ‘ఆట్ కమల్ హాసన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై శ్రీరెడ్డి కూడా స్పందించింది.
“అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీ ని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా… ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు, పాపం అవి తనని బాగా బాదిస్తున్నాయి, నా పోస్ట్ లకు కూడా, చాలా మంది దరిద్రమైన కామెంట్స్ పెడుతున్నారు, తప్పురా అలా చెయ్యకూడదు, మంచిగా ఉందాం” అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.
https://twitter.com/MsSriReddy/status/1692869705177125180?s=19
మరి కాసేపటికే ఇంకో పోస్ట్ పెట్టి “A few minutes later, అబ్బా కమల్ హసన్… ఇలాంటి కథలు పడిద్ది అని నాకు తెలుసు, అందుకే ఆంటీ అన్నది” అంటూ కోట్ చేసింది. అనసూయకి శ్రీరెడ్డి ఇచ్చిన కౌంటర్ ని అనసూయ హేటర్స్ రీపోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/MsSriReddy/status/1692873517585625205
