Sri Ranga Neethulu first look poster released: సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న తాజా మూవీ `శ్రీరంగనీతులు`. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈ క్రమంలోనే జూన్ 29 తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మలతో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. ఈ సినిమాని రాధావి ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు.
Dil Raju Son : దిల్ రాజు కొడుకు ఎలా ఉన్నాడో చూశారా?…. మొదటి సారిగా ఫొటో లీక్!
న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ కాపీ రెడీ అయిన వెంటనే అతి త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. `అర్జున్ రెడ్డి ` ఫేమ్ హర్ష వర్థన్ రామేశ్వర్, `సేవ్ ది టైగర్స్` ఫేమ్ అజయ్ అర్సాడ సంగీతం ఈ సినిమాకు టిజో టామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విరాజ్ అశ్విన్, తనికెళ్ల భరణి, గీత భాస్కర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలలో కనిపించనునున్న ఈ సినిమాలో దేవీ ప్రసాద్, జీవన్ రెడ్డి, సంజయ్ స్వరూప్,సీవిఎల్ నరసింహా రావు తదితరులు నటిస్తున్నారు.
