NTV Telugu Site icon

Sreleela : ఆ విషయంలో రష్మిక బాటలో నడుస్తున్న శ్రీలీల..!!

Whatsapp Image 2023 06 16 At 7.46.30 Pm

Whatsapp Image 2023 06 16 At 7.46.30 Pm

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా చేసిన పెళ్లిసందడి సినిమాతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతో పెద్దగా విజయం రాక పోయినప్పటికీ ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.. ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం తో ఈమెకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి.ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకుంది.ఈమె ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉంది.. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.మహేష్ బాబు గుంటూరు కారం అలాగే బాలకృష్ణ భగవంత్ కేసరి, రామ్ పోతినేని సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ, నితిన్ మరియు వైష్ణవ్ తేజ్ వంటి హీరోల సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న శ్రీ లీల నటి రష్మిక మందన బాటలో నడుస్తుందని తెలుస్తోంది. నటి రష్మిక కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగు సినిమాలను చేస్తుంది.. ఇలా తెలుగులో వరుస అవకాశాలతో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్ అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉంది.. అయితే శ్రీ లీల కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పరిచయం కావడమే కాకుండా తెలుగు లో వరుస సినిమా అవకాశాలను పొందింది.. అయితే ఇప్పటికే ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అవకాశాలు వచ్చాయని సమాచారం.ఇక త్వరలోనే బాలీవుడ్ సినిమాల లో కూడా నటిస్తూ రష్మిక బాట లోనే నడుస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలం లోనే వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీ హీరోయిన్ గా మారింది శ్రీలీల…