NTV Telugu Site icon

Sreemukhi: మీది నాది సేమ్‌ పించ్‌ అంటూ చిరంజీవికి లవ్ ప్రపోజ్ చేసిన శ్రీముఖి..

Sreemukhi Bholashankar

Sreemukhi Bholashankar

దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో, మెగాస్టార్ హీరోగా తెరకేక్కిన సినిమా భోళా శంకర్.. మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి టాలివుడ్ సినీ ప్రముఖులు, డైరెక్టర్స్ హాజరైయారు.. ఈ ఈవెంట్ కు బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి కూడా హాజరై సందడి చేసింది.. హైపర్ ఆది స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది.. మెగా ఫ్యామిలీ పై తన అభిమానాన్ని చాటుతూ ప్రశంసలు కురిపించారు..

శ్రీముఖి `భోళాశంకర్‌` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఆమెది కాస్త బోల్డ్ రోల్‌ అని తెలుస్తుంది. ట్రైలర్‌లో శ్రీముఖి ఆకట్టుకుంది. చిరంజీవితో ఆమెకి మంచి కాంబినేషన్‌ సీన్లు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈవెంట్‌లో తన ఆనందాన్ని పంచుకుంది శ్రీముఖి.
ఇక శ్రీముఖి మాట్లాడుతూ.. స్టేజ్ మీదనే భోళా జి ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసింది.. ఆ మాటకు చిరంజీవి తెగ సిగ్గు పడ్డాడు.. అలాగే మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టమన్నారు. ఆ అదృష్టం తమ తలుపు తట్టిందని తెలిపింది. తనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మెహర్‌ రమేష్‌కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కీర్తిసురేష్‌తో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పింది..

అంతేకాదు.. అందరికి 4జీ, 5జీ మాత్రమే తెలుసు, కానీ నాకు తెలిసిన జీ `భోళాజీ` అంటూ హంగామా చేసింది. దీంతో శ్రీముఖి స్పీచ్‌ అందరిని ఆకట్టుకుంది. తాను ఒక అభిమానినే అని వెల్లడించింది.. ఇక తన మాటలే కాదు ఈ ఈవెంట్ లో శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి..బ్లాక్‌ చుడీదార్‌ లో ఆమె మెరిసింది. నయా అందాలతో హంగామా చేసింది. `భోళాశంకర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది.. భోళా శంకర్ మూవీ ఈ నెల 11 న థియేటర్లలో సందడి చేయబోతుంది..