NTV Telugu Site icon

Sreemukhi: మిస్ ఫైరయిన శ్రీముఖి ఎలివేషన్స్.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్!

Sreemukhi

Sreemukhi

తెలిసి మాట్లాడతారో లేక తెలియక మాట్లాడతారో కానీ ఒక్కోసారి సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు వల్ల ట్రోల్ అవుతున్న సందర్భాలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. అలా తాజాగా శ్రీముఖి టార్గెట్ అయింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది. దిల్ రాజు సొంత ఊరు నిజామాబాద్ కావడం శ్రీముఖి కూడా అదే ప్రాంతానికి చెందిన ఆమె కావడంతో ఆమె హోస్ట్ చేసిందని ప్రచారం ఉంది. ఆ విషయం అలా ఉంచితే దిల్ రాజు ఈవెంట్ కి హాజరైన తర్వాత ఆయనకు ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో ఆయన పక్కనే ఉన్న సోదరుడు శిరీష్ తో కలిపి ఆమె ఒక పోలిక పెట్టింది. అదేంటంటే ఎప్పుడో రామలక్ష్మణులు అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి విన్నాం కానీ ఇప్పుడు కళ్ళముందే దిల్ రాజు శిరీష్ కనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేసింది.

Rajini Kanth : ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న సూపర్ స్టార్

నిజానికి ఫిక్షనల్ అంటే తెలుగులో కల్పిత అని అర్థం. హిందూ సమాజం దేవుడిగా భావించే రాముడిని ఆయన సోదరుడు లక్ష్మణుడిని కల్పిత పాత్రలుగా ఆమె పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు హిందుత్వ వాదులు. ఆమె తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి నటిగా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి అది వర్కౌట్ కాకపోవడంతో యాంకరింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అలా పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె బిగ్బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ పెంచుకుంది. ప్రస్తుతానికి సినిమా ఈవెంట్లతోపాటు కొన్ని టీవీ షోస్ కూడా చేస్తుంది. మరి ఈ వ్యవహారం మీద శ్రీముఖి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Show comments