Site icon NTV Telugu

19న ‘క్రేజీ అంకుల్స్’ విడుద‌ల‌

గుడ్ సినిమా గ్రూప్‌ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్‌. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుద‌ల‌ చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ లిరిక‌ల్ సాంగ్‌ని ఇంతకు ముందు దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. రఘు కుంచే సంగీతం అందించగా లిప్సిక గానం చేసిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ పాట ఇప్పటికే 50 లక్షల వ్యూస్ తో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.ఈ సినిమాను మేలో విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ నెల 19న విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నాం అని నిర్మాత శ్రేయాస్ శ్రీను చెప్పారు.

https://youtu.be/D7qK0P3ktPE
Exit mobile version