NTV Telugu Site icon

Sreeleela: ఎంత సక్కగున్నవే లీలా… ఎంత సక్కగున్నవే

Sreeleela

Sreeleela

ధమాకా సినిమాతో శ్రీలీల ఇండస్ట్రీలో హాట్ కేక్ అయ్యింది, ఎవరు ఏ సినిమా అనౌన్స్ చేసిన శ్రీలీలని హీరోయిన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల లేని తెలుగు సినిమా లేదంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా శ్రీలీల లైనప్ లో ఉన్న సినిమాల్లో PVT 04 కూడా ఒకటి. మెగా మేనల్లుడు, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ హీరోయిన్ అపర్ణ దాస్ మరో కీ రోల్ లో కనిపించనున్న #PVT04 సినిమాకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also: Kriti Sanon: ఆ.. ఫొటోషూట్‌ లో భయపడ్డా

ఈరోజు గ్లిమ్ప్స్ అనౌన్స్మెంట్ ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీలీలా చాలా క్యూట్ గా కనిపించి, అట్రాక్ట్ చేస్తోంది. ‘చిత్ర’ అనే పాత్రలో శ్రీలీల నటిస్తుందని మేకర్స్ పోస్టర్ ని లాంచ్ చేశారు. దీంతో ఈ యంగ్ హీరోయిన్ ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో #PVT04 పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. శ్రీలీల క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే యూత్ ని థియేటర్స్ కి రప్పించడం ఈజీ. మరి వైష్ణవ్ తేజ్ సినిమాకి శ్రీలీల క్రేజ్ ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే PVT 04 ఫస్ట్ గ్లిమ్ప్స్ ని మే 15న సాయంత్రం 4:05 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ గ్లిమ్ప్స్ తో PVT 04 అంచనాల మీటర్ ఎంతవరకూ పెరుగుతాయి అనేది చూడాలి.