టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్‌లో కీలక దశలో ఉంది. వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ, ఆమెకు సరైన హిట్ మాత్రం దొరకలేదు. ‘ధమాకా’ తర్వాత వచ్చిన సినిమాలు ఆమె నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అందుకే ఇప్పుడు శ్రీలీల తన తదుపరి సినిమా ‘పరాశక్తి’ మీద నమ్మకం పెట్టుకుంది. ఈ సినిమాను ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దు’ వంటి భావోద్వేగపూరిత సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు. సుధా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు సాధారణంగా లోతైన భావోద్వేగాలతో, బలమైన వ్యక్తిత్వంతో ఉంటాయి. అందుకే ఈసారి కూడా శ్రీలీల పాత్రలో ప్రత్యేకత ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : Sudheer Babu : ‘బాహుబలి’ రేంజ్ కాన్సెప్ట్‌తో కొత్త మూవీకి సైన్ చేసిన సుధీర్ బాబు!
ఇటీవలి కాలంలో శ్రీలీలపై వచ్చిన విమర్శలు ఆమె ఎక్కువగా రొటీన్ గ్లామర్ రోల్స్‌లో మాత్రమే కనిపిస్తోందనే అంశం. కానీ ‘పరాశక్తి’తో ఆ ఇమేజ్‌ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. సుధా కొంగర దృష్టిలో హీరోయిన్ పాత్రకు ఎప్పుడు సమాన ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి, ఈ సినిమా శ్రీ లీల నటనను కొత్త స్థాయికి తీసుకెళ్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోగా శివ కార్తికేయన్ నటిస్తుండటం మరో హైలెట్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై మంచి హైప్ నెలకొంది. శివ కార్తికేయన్ – సుధా కొంగర కాంబినేషన్‌కి తమిళనాట భారీ ఫాలోయింగ్ ఉండటంతో, తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి కుతూహలం ఏర్పడింది. ‘పరాశక్తి’ హిట్ అయితే, అది శ్రీలీల కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వడం ఖాయం. ఫెయిల్యూర్స్‌తో కొంత వెనక్కి వెళ్లిన ఈ బ్యూటీ ఇప్పుడు సుధా కొంగర లాంటి దర్శకురాలి గైడెన్స్‌లో తిరిగి ఫామ్‌లోకి వస్తుందనే నమ్మకం అభిమానుల్లో గట్టిగా కనిపిస్తోంది.
