Site icon NTV Telugu

Sreeleela : సౌత్ క్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లో శ్రీలీల

Sreelela

Sreelela

దక్షిణాది సినీ ప్రేక్షకులను తన సహజమైన నటన తో, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఖాతాలో మరో హిందీ ప్రాజెక్ట్ కూడా చేరినట్లు సమాచారం.

Also Read : Krithi Shetty: బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి

ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న నటుడు విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్న దోస్తానా 2లో శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. యువతను విశేషంగా ఆకట్టుకున్న దోస్తానా సినిమాకి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. మొదట ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్‌న్ని ఎంపిక చేసినా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ గోల్డెన్ ఛాన్స్ శ్రీ లీలకు దక్కిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై నిర్మాత కరణ్ జోహార్ ఫైనల్ చర్చలు జరుపుతున్నారు అని టాక్. దీంతో శ్రీలీలకు బాలీవుడ్‌లో బంపర్ బ్రేక్ లభించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version