మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా”లో నటిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీలీలని పావని పాత్రలో పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో శ్రీలీలతో పాటు రవితేజ కూడా ఉన్నారు.
Read Also : Valentines Day : ఆర్జీవీ ప్రేమ పాఠాలు… అడ్వైజ్ ఏమిటంటే ?
ఇద్దరూ ఏదో ఒక విషయం గురించి చర్చించుకుంటున్నారని ఈ పిక్ చూస్తుంటే అర్థమవుతోంది. రవితేజ ఆమెకు ఏదో చెబుతుండగా, శ్రీలీల దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కన్పిస్తోంది. మొత్తానికి ఇది రవితేజ సినిమాలో హీరోయిన్ మాయ చేసే సన్నివేశం అని తెలుస్తోంది. ఇక పిక్ లో శ్రీలీల టీ-షర్ట్, డెనిమ్ జీన్స్‌లో శ్రీలీల అందంగా, మోడ్రన్ యువతిగా కన్పిస్తోంది. కాగా ఇటీవలే రవితేజ ‘ఖిలాడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘ఖిలాడీ’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.
