Site icon NTV Telugu

Sreeja Konidela: ఫైనల్లీ మౌనం వీడిన చిరు చిన్న కూతురు.. అదే సమాధానం అంటూ ఎమోషనల్!

Sreeja Konidela News

Sreeja Konidela News

Sreeja Konidela Instagram Story Became Hot Topic: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె అప్పట్లో మీడియా ముందుకు వచ్చి తమ ప్రాణహాని గురించి కామెంట్స్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే శిరీష్ భరద్వాజ్ నుంచి విడి పోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆమెకు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. మెగా అల్లుడు కావడంతో కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా మారాలని ప్రయత్నాలు చేసి ఒకటి రెండు సినిమాలు చేశారు. ప్రస్తుతానికి కూడా హీరోగా కొనసాగుతున్నారు. అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య దూరం పెరగడంతో వారు అధికారికంగా విడాకులు తీసుకున్నారో లేదో క్లారిటీ లేదు.కానీ చాలా రోజుల నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లో ఒకరి ఫోటోలు మరొకరు డిలీట్ చేయడంతో దాదాపుగా వారు విడిపోయినట్లే అనే ప్రచారం అయితే ముందు నుంచి ఉంది.

Hema Photo Leaked: రేవ్ పార్టీలో హేమ ఫోటో లీక్?

అయితే శ్రీజ తన వివాహ బంధం గురించి గానీ ప్రస్తుతం తన స్టేటస్ గురించి కానీ ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది లేదు. కానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తన భావాలను ఆమె వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చాలామంది అబ్జర్వ్ చేయలేదు కానీ ఆమె తన భావాలని ఈ విధంగా బయటపెట్టింది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం ఎవరైనా తమను తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారో ఇతరులు కూడా అదే స్థాయిలో చూస్తారని అలాగే ఆ స్థాయి వాళ్ళనే కలుసుకుంటారని చెప్పుకొచ్చింది. అంతేకాక ఎన్ని ప్రశ్నలకు అయినా ఇదే ఒక్కటే ఆన్సర్ అంటూ ఆమె పేర్కొనడంతో ఈ పోస్ట్ ఆమె వివాహ జీవితం గురించి పెట్టిందేమో అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కి సమాధానంగా ఆమె ఇలా పెట్టి ఉండచ్చని కూడా అంటున్నారు. అయితే ఆ విషయం మీద ఆమెనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

Exit mobile version