Sreeja Konidela: 2022లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. కొత్త జర్నీ ప్రారంభమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreeja Konidela Instagram Post Going Viral: మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కొంతకాలం నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో నిత్యం వార్తల్లోకెక్కుతోంది. ఈమధ్య తన భర్త కళ్యాణ్‌దేవ్‌తో కలిసి ఆమె కనిపించకపోవడం, కళ్యాణ్ కూడా మెగా ఈవెంట్లకు గౌర్హాజరు అవుతుండటంతో.. ఇద్దరి మధ్య ఏమైనా చెడిందా? అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఈ ఇద్దరు ఇప్పటివరకూ స్పందించలేదు కానీ, ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అందుకే, తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఇద్దరు తామిద్దరు కలిసున్న ఫోటోలను షేర్ చేయట్లేదని అంటున్నారు. ఇలాంటి తరుణంలో శ్రీజ పెట్టిన కొత్త పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త సంవత్సరం సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసిన శ్రీజ.. 2022లో ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశానని పేర్కొంది. ఆ వ్యక్తితో పరిచయం చేసినందుకు 2022కి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు.. ఆ వ్యక్తికి తన గురించి బాగా తెలుసని, తనని అమితంగా ప్రేమిస్తున్నాడని, కష్టసుఖాల్లో తోడుంటూ చాలా కేరింగ్‌గా చూసుకుంటాడని, ఎల్లప్పుడూ సపోర్ట్‌గా కూడా నిలుస్తాడని చెప్పింది. ఆ వ్యక్తిని కలవడం నిజంగా అద్భుతమని, ఇక నుంచి సరికొత్త జర్నీ మొదలైందని చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. శ్రీజనే. ఇన్నాళ్లూ ఇతర వ్యవహారాల్లో పడి తన గురించి పట్టించుకోని శ్రీజ, 2022లో మాత్రం తనని తాను పరిచయం చేసుకున్నానని ఆ పోస్టులో పేర్కొంది. తన గురించి తాను బాగా తెలుసుకుంది కాబట్టి, ఇకపై కొత్త జర్నీ మొదలుపెట్టాలని శ్రీజ నిర్ణయించుకుంది. అదన్నమాట సంగతి!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
కాగా.. శ్రీజ, కళ్యాణ్ దేవ్ల వివాహం 2016లో జరిగింది. వీరి పెళ్లి వేడుకని మెగా కుటుంబం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. తమ దాంపత్య జీవితాన్ని బాగానే గడిపారు. వ్యాపారవేత్త అయిన కళ్యాణ్.. శ్రీజని వివాహమాడిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. వీరికి నవిష్క అనే కుమార్తె సైతం జన్మించింది. అంతా సాఫీగానే సాగుతున్న తరుణంలో.. శ్రీజ, కళ్యాణ్ మధ్య అనుకోకుండా దూరం పెరిగింది. అందుకు కారణాలేంటో ఇంతవరకూ తెలీదు. తమ రిలేషన్‌షిప్‌పై వాళ్లు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా, వాళ్లిప్పుడు వేర్వేరుగా తమ జీవితాల్ని లీడ్ చేస్తున్నారన్న వాదనలైతే జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..