Sree leela Work Experience with Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో శ్రీలీల విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు. . కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో శ్రీలీల మాట్లాడుతూ భగవంత్ కేసరి కథ నాకు చాలా నచ్చిందని, గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలు ఉంటాయని అన్నారు. ఒక ఎమోషనల్ డ్రైవ్, నటనకు ఆస్కారం ఉండే సినిమా ఇదని నటనని నిరూపించుకునే సినిమాలా అనిపించిందని అన్నారు. ఇప్పుడు కాకపొతే మరో కొంతకాలం తర్వాత ఇలాంటి పాత్ర చేయలేనని, ఈ పాత్ర చేయడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. శ్రీలీల అనగానే ప్రేక్షకుల మనసులో డ్యాన్స్ అనే ముద్రపడిపోయింది, ఇది చాలా పాజిటివ్ అయినప్పటికీ ఒక నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఉంటుందని ఆమె అన్నారు.
Sree leela: అందుకే డాక్టర్ అవ్వాలని ఫిక్సయ్యా.. ఎన్ని కష్టాలు వచ్చినా డాక్టర్ శ్రీలీల అనిపించుకుంటా!
ఈ సినిమాతో నాకు ఆ అవకాశం దొరికిందని అనిపించిందని అన్నారు. మొదటిసారి బాలకృష్ణ గారు సెట్స్ కి వస్తున్నపుడు మీ రియాక్షన్ ఏమిటి ? అని అడిగితే మొదట షాట్ ట్రైలర్ లో చూపించిన ట్రైనింగ్ అని అప్పుడు నేను పుష్ అప్స్ చేయాలి, కానీ చేయలేకపోతుంటాను. ఆయన పట్టుబట్టి చేయిస్తుంటారని అన్నారు. షాట్ అయిన తర్వాత నిజంగా నీకు పుష్ అప్స్ చేయడం రాదా ? అని అడిగితే డైరెక్టర్ గారే అలా చేయమన్నారని ఆయన మీదకు తోసేశానని అన్నారు. నిజానికి ఆయనని చూసినప్పుడు నాలో కొంచెం నెర్వస్ ఫీలింగ్ ఉంది, ఆయన్ని కలిసినప్పుడు ఒక భయం ఉంది, ఐతే ఆయనను కలిసిన మరుక్షణమే ఆ భయం పోయిందని నిజంగా ఆయనకి యాప్ట్ పేరు పెట్టారు, ఆయనది పసి మనసు అని అన్నారు. ఆయన చాలా స్వీట్ అని అన్నారు. ఇక అనిల్ రావిపూడి గారి సినిమాల్లోని హీరోయిన్స్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్ వుంటుంది. ఇందులో మీ పాత్రకు కూడా అలాంటి స్టైల్ ఇచ్చారా ? అని అడిగితే ఈ సినిమాతో అనిల్ రావిపూడి కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఇచ్చారని,. మీరు గమనిస్తే ప్రమోషనల్ మెటీరియల్ అన్నింట్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుందని అన్నారు. ఇందులో నేను చేసిన విజ్జి పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, విజ్జి పాప భయపడే అమ్మాయి, అదే సమయంలో చలాకీగా ఉంటుందని అన్నారు.