NTV Telugu Site icon

Sridevi: సెల్యులాయిడ్ పై చెక్కుచెదరని ‘అతిలోక సుందరి శ్రీదేవి’ అభినయం..

Untitled Design 2024 08 13t113357.145

Untitled Design 2024 08 13t113357.145

భారతీయ చలనచిత్ర రంగంలో అతిలోక సుందరి అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే ఓకే ఒక పేరు శ్రీదేవి. శ్రీదేవి 1963 లో ఆగస్టు 13న ప్రస్తుత తమిళనాడులోని శివకాశి సమీపంలోని మీనంపాటి గ్రామంలో అయ్యప్పన్ మరియు రాజేశ్వరి దంపతులకు శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్‌గా జన్మించారు. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో కేవలం 4 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘కంధన్ కరుణై’ అనే తమిళ సినిమాలో నటించారు.

Also Read: Tollywood: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న చైతు జొన్నలగడ్డ, రవి ఆంథోని ‘ధార్కారి #MM పార్ట్ 2′

కెరీర్ తొలినాళ్లలో నటిగా ఎక్కువగా తమిళం, మలయాళం చిత్రాలలో నటించింది శ్రీదేవి. 1976లో కే.బాలచందర్‌ దర్శకత్వంలో ‘మూండ్రు ముడిచు’ సినిమా శ్రీదేవికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఒక మైలురాయి ఆ తరువాత ఆమె నటించిన ఎన్నో సినిమాలు అన్ని బాషలలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. హిందీలో నగీన, మిస్టర్ ఇండియా, చాందినీ, చాల్ బాజ్ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. బాలీవడ్ లో ఎక్కువగా జితేంద్రతో కలిసి నటించిన “హిమ్మత్ వాల” ఆమె హిందీ చిత్రరంగంలో స్టార్ గా నిలబెట్టింది.

Also Read: Devara: తారక్ ఫ్యాన్స్.. ఆగస్టు 15న దేవర స్పెషల్ వీడియో వస్తోంది..

తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన శ్రీదేవి, అగ్రకథానాయికగా టాలీవుడ్ ను చాలా కాలం పాటూ రాణించారు. టాలీవుడ్‌ సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి అగ్ర కథానాయకులు అందరితోనూ నటించింది అతిలోక సుందరి. ఇక మెగాస్టార్ చిరంజీవితో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాతో ‘అతిలోక సుందరి’ గా అభిమానులతో జేజేలు పలికిచుకుంది శ్రీదేవి. వెంకటేష్‌తో క్షణ క్షణం, నాగార్జునతో గోవిందా గోవింద సినిమాల్లో నటించి మెప్పించింది.1997లో వచ్చిన జుదాయి తరువాత ఆమె వెండితెరకు దూరం అయ్యారు. ఆ వెంటనే శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వివాహమాడారు.పెళ్ళి అయ్యాక సినిమాలకు కొన్నాళ్ళు పాటు దూరమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది శ్రీదేవి. వారే జాన్వి,ఖుషి. జాన్వీ జూనియర్ ఎన్టీయార్ సరసన దేవర సినిమాతో టాలివుడ్ కు పరిచయం కాబోతోంది.

Also Read: Double Ismart : రిలీజ్‌కు రెండు రోజులు.. ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..?

2012 లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు హిట్ సినిమాల్లో నటించారు. 2017లో వచ్చిన మామ్ శ్రీదేవి 300వ మరియు చివరి సినిమా. భారతీయ సీని పరిశ్రమలో మహారాణిగా రాణించిన శ్రీదేవిని 2017 లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్ లో ఓ హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి శ్రీదేవి మరణించింది. శ్రీదేవి ఈ లోకం విడిచి వెళ్లిన అతిలోక సుందరిగా అభిమానుల్లో ఎప్పటికి చిరస్థాయిలో నిలిచి ఉంటుంది. నేడు శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా అతిలోక సుందరికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Show comments