NTV Telugu Site icon

Mahesh bday special: కోట్ల హృదయాల ‘గుండె చప్పుడు’ ఘట్టమనేని మహేష్ బాబు

Untitled Design 2024 08 09t073411.040

Untitled Design 2024 08 09t073411.040

తెలుగు చలనచిత్ర చరిత్ర ప్రేక్షకులు మరువలేని ధృవతార సాహససంచలనాలకు కేంద్ర బిందువు నటశేఖర సూపర్ స్టార్ డేరింగ్ & డేషింగ్ హీరో “కృష్ణ” నటవారసత్వాన్ని, ఆయన లెగసీని చిన్నతనంలోనే అందిపుచ్చుకున్న చిన్ననాటి లిటిల్ ప్రిన్స్, పెద్దయ్యాక ప్రిన్స్ గా మారిన రాజకుమారుడు ఒక్కడే. తర్వాత పోకిరిగా మారి ఇండస్ట్రీ రికార్డు కొల్లగొట్టి అక్కడ నుంచి దూకుడు పెంచి కలెక్షన్ లలో సంచలనాలు సృష్టిస్తూ రికార్డ్ ” బిజినెస్ లు చేస్తున్న బిజినెస్ మేన్ నిర్మాతలను శ్రీమంతులను చేస్తూ ప్రాంతీయ సినిమాలతోనే సంచలనాలు నమోదుచేసి ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు టాలీవుడ్ కు అందించిన నాని,ఒక్కటి కూడా రీమేక్ సినిమాలు చేయని ‘వన్’ అండ్ ఓన్లీ కుర్రోడు, మహేశ్‌ కేవలం 28 సినిమాలకే 8 నంది అవార్డులు అందుకున్న అతడు, ‘రాజకుమారుడు’తో తొలిసారి ఉత్తమ నటునిగా నందిని అందుకున్న మహేశ్.. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్ చిత్రాల ద్వారా కూడా నంది అవార్డుకు ఎంపికయిన గుంటూరోడు మహేశ్.

తమకు వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాలకు రాకూడదని మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వారి పాలిట ‘అర్జున్’డిగా నిలిచి, పలు సేవాకార్యక్రమాలలో పాలుపంచుకుంటూ అందరిచేత సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్న మహర్షి ఘట్టమనేని సూపర్ స్టార్. అతి త్వరలో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినిమా పాన్ ఇండియా కాదు కాదు “పాన్ వరల్డ్ “సినిమా ద్వారా తన ఖలేజా చూపించి ఇండియన్ సినిమా రికార్డుల ను తిరగరాయడానికి వస్తున్న మన “ఘట్టమనేని మహేష్ బాబు” కు ( 50 ఏళ్ల వయస్సు వస్తున్నా కూడా ఎవర్ గ్రీన్ లా కనిపిస్తున్న) ‘మురారి’, తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ , మహేశ్ అనే నేనుగా అభిమానుల ఆశలను నెరవేరుస్తూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువరాజు మహేశ్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు