Country With Zero Muslim Population: భారత్ మతపరంగా అత్యంత వైవిధ్య భరిత దేశం. పురాతన హిందూ మతం, ఆధునిక భావాలతో స్థానికంగా పుట్టిన బౌద్ధం, జైనంతోపాటు వలసలతో వచ్చిన ఇస్లాం, క్రైస్తవం సహా అనేక ఇతర మతాలు ఇక్కడ ఉన్నాయి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు మతాల ద్వారానే మనుగడలోకి వచ్చి విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా భారతీయుల దైనందిన జీవితంలో మతం, మత నియమాలు ప్రధాన భాగాలుగా మారిపోయాయి. భిన్నత్వంలో ఏకత్వానికి సూచికగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది మన దేశం.
READ MORE: Pakistan: పాక్ ఆర్మీ టార్గెట్‌గా ఐఈడీ పేలుడు.. స్పాట్‌లో ఎంత మంది చనిపోయారంటే..
Population Education రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలో దాదాపు 10,000 విభిన్న మతాలు ఉన్నప్పటికీ, ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది క్రైస్తవం (31%), ఇస్లాం (24%), హిందూ మతం (15%), బౌద్ధమతం (7%) ఈ నాలుగింటిలో ఒకదానికి కట్టుబడి ఉన్నారు. భారత్ అంత కాకపోయినా ప్రపంచంలోని అన్ని మెజారిటీ దేశాల్లోనూ విభిన్న మాతల వాళ్లు నివసిస్తుంటారు. ఇలాగే ముస్లింలు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. కానీ ముస్లిం జనాభా లేని దేశం భూమి మీద ఉందనే విషయం మీకు తెలుసా? దీని గురించి తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా ఉండరు. వాటికన్ నగరం కాథలిక్ సమాజ ప్రజలకు మతపరమైన, సాంస్కృతిక ప్రదేశం. కాథలిక్ చర్చికి అధిపతి, పోప్ ఇక్కడ నివసిస్తున్నారు. మక్కా ముస్లింలకు పవిత్ర నగరం అయినట్లే.. వాటికన్ నగరం క్రైస్తవులకు అత్యంత పవిత్ర నగరం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పూర్తిగా నియమించబడిన ఏకైక దేశం ఇది. 1984లో ఈ దేశం జాబితాలోకి చేరింది. అంతే కాదు.. వాటికన్ సిటీలో మసీదులు, సినగోగులు, హిందూ లేదా బౌద్ధ దేవాలయాలు లేవు. నిజానికి, వాటికన్‌లో ప్రొటెస్టంట్ లేదా ఆర్థడాక్స్ చర్చిలు కూడా లేవు.
