NTV Telugu Site icon

Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాకి స్పెషల్ ఆఫర్లు.. రెండు రోజులు మాత్రమే, త్వరపడండి!

Adipurush Movie Ticket Offe

Adipurush Movie Ticket Offe

Adipurush special discount offers in national multiplex chains: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించడమే కాక సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజులకు 305 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, అయితే 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవు. వీకెండ్ లో పర్లేదు కానీ వీక్ డేస్ లో ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
Nagarjuna: ఆ కుర్ర రచయిత సినిమాను రిజెక్ట్ చేసిన నాగ్.. ఎందుకంటే?
ఇప్పుడున్న కలెక్షన్స్ చూస్తే ఇలానే కనుక ట్రెండ్స్ ఉంటే 400 కోట్ల కంటే తక్కువ వసూళ్లు రావచ్చు. వీక్ డేస్ లో ఈ సినిమా దారుణంగా క్రాష్ అయ్యింది. సోమ, మంగళవారాల కలక్షన్స్ చూస్తే ఈ సినిమా డిజాస్టర్ దిశగా పయనిస్తుండా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో నష్టాలను తగ్గించుకోవడానికి, జనాన్ని థియేటర్లకు రప్పించడానికి 3డి వెర్షన్ సినిమాను కొన్ని మల్టీప్లెక్స్ చైన్‌లలు అయిన పివిఆర్, ఐనాక్స్ మరియు సినీపోలిస్‌లలో ధరలను భారీగా తగ్గించారు. జూన్ 22 మరియు 23వ తేదీల్లో 3డి వెర్షన్ ధరలను రూ.150/-లకు తగ్గించారు. ఈ సినిమాను చూసేలా ప్రేక్షకులను ఉత్సాహపరిచే ప్రయత్నంలో మేకర్స్ “అబ్ హర్ భారతీయ దేఖేగా (ఇప్పుడు ప్రతి భారతీయుడు చూస్తాడు) అనే క్యాప్షన్‌తో మార్కెటింగ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.