Theatre Releases: ఈ వారం థియేటర్లలో సౌత్ జాతర.. హారర్ నుంచి యాక్షన్ వరకు సందడే సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theatre Releases: ఈ వారం థియేటర్లలో దక్షిణాది సినిమాల హవా ఎక్కువగానే ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. హారర్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా వరుకు వస్తున్న సినిమాలతో మూవీ లవర్స్ కూడా సేద తీరబోతున్నారు. మరి ఆ సౌత్ సినిమాల పేర్లు, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకుందాం పదండి.
1. కొరియన్ కనకరాజు
వరుణ్ తేజ్ కొణిదెల, రితికా నాయక్, సత్య, సునీల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ తెలుగు మూవీ 2026 ఆగస్టు 7న రిలీజ్ కాబోతోంది. రాయలసీమ ప్రాంతంలోని పెనుకొండకు చెందిన తొందరపాటు స్వభావం గల యువకుడు కనకరాజు జీవితం, ఒక కొరియన్ డ్రాగన్ ఆకారపు కుండలో బంధించబడిన ఆత్మ వల్ల ఎలా మారిపోతుందో ఈ ‘కొరియన్ కనకరాజు ‘ కథ వివరిస్తుంది. ఇందులో ఎవరైనా “కొరియా” అనే పదాన్ని ఉచ్చరించినప్పుడల్లా, అతనిలోని మరో కోణం బయటపడుతుంటుంది. అతను ఒక యోధుడిలా మారిపోతుంటాడు. రరాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
Also Read
- Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
- Farzi Season 2 Update: మూడేళ్ల నిరీక్షణ తర్వాత 'ఫర్జీ 2'.. స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ!
- Lokesh & Dulquar : క్రైమ్ వరల్డ్, పోలీసుల ఛేజ్.. ఒకే ఫార్ములాతో వస్తున్న రెండు సినిమాలు
- Releases Postpone : ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పోస్ట్‌పోన్ కాబోతున్నాయి
2. వివాహ్
ధ్యాన్ శ్రీనివాసన్ , అభిషేక్ శ్రీకుమార్, ధ్రువన్, నయన ఎల్జా, అనీష్ గోపాల్, శృతి జయన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ
బ్లెస్సన్ ఎల్సా దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మలయాళం మూవీ 2026 ఆగస్టు 7న థియేటర్లలోకి రాబోతోంది. ప్రేమ, పెళ్లి ద్వారా ఒకరితో ఒకరు ముడిపడిన నలుగురు మహిళల జీవితాల ప్రయాణాలను ‘వివాహ్’ చూపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
3. అయోగ్య 2
ఈ కన్నడ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఎస్. మహేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. సతీష్ నీనాసం, రచితా రామ్, రవిశంకర్ పి, సాధు కోకిల, శివరాజ్ కెఆర్ పేట్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఆగస్టు 7న ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. ఈ కథ ఒక పల్లెటూరి యువకుడు గౌరవనీయమైన గ్రామ పంచాయతీ సభ్యుడిగా మారిన సిద్ధెగౌడ జీవితం చుట్టూ తిరుగుతుంది.
4. డిసి
లోకేష్ కనగరాజ్ , వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించారు. ఈ తమిళ రొమాంటిక్ యాక్షన్ మూవీ 2026 ఆగస్టు 7 నుంచి రిలీజ్ కాబోతోంది. ఒక పోలీస్ అధికారి మరణం, దొంగిలించబడిన ఆయుధాలకు సంబంధించిన అంశాలతో ఈ స్టోరీ సాగుతుంది. వీటికి సంబంధం ఉన్నట్లు దేవదాస్ అనే వ్యక్తి చుట్టూ నడిచే కథే ఈ డిసి
5. అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి
ఈ తెలుగు రొమాంటిక్ డ్రామాలో పవన్ మహావీర్, పాసం వర్షిక, సుహానా ముద్వారి, సుమన్ తల్వార్, రావు రమేష్, రాజీవ్ కనకాల వంటి నటులు నటించారు. శివాల ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా 2026 ఆగస్టు 7న రిలీజ్ కాబోతోంది.
అమ్మ నాకు అబ్బాయి కావాలి చిత్రం, కష్టాలతో కూడిన బాల్యం గడిపినప్పటికీ, తన తండ్రిని కనిపెట్టాలనే ఆశతో పాటు, మంచి జీవితాన్ని నిర్మించుకోవాలనుకునే రామ్ అనే యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది.
6. కెజెక్యూ
ధీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి సుధాకర్ చెరుకూరి దర్శకత్వం వహించారు. ఈ కన్నడ యాక్షన్ డ్రామా ఆగస్టు 7న వస్తోంది. 1990వ దశకంలో సాగే ‘KJQ’, నేర ప్రపంచంలోకి ప్రవేశించిన ఇద్దరు చిన్ననాటి స్నేహితుల ఎదుగుదలతో పాటు పతనాన్ని కూడా ఈ కథ వివరిస్తుంది.
7. తుడక్కం
విస్మయ మోహన్‌లాల్, మోహన్‌లాల్ (అతిధి పాత్ర), ఆశిష్ జో ఆంటోని, బాబీ కురియన్, సాయి కుమార్, KB గణేష్ కుమార్, మనోజ్ K. జయన్, మియా జార్జ్ ఇందులో నటించారు. ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ ఆగస్టు 7న రిలీజ్ అవుతోంది. అనుకోని సంఘటనతో జీవితం తలక్రిందులైన ఒక యువతి కథే ‘తుడక్కం’. సవాళ్లను అధిగమిస్తూ, బ్రతకడానికి ఆమె చేసే ధైర్యం, పట్టుదల వంటి అంశాలే ఇందులో హైలెట్ గా ఉండబోతున్నాయి.
8. డిటెక్టివ్ తీక్షణ
ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రియాంక ఉపేంద్ర, విజయ్ సూర్య, అవినాష్, కేఎస్ శ్రీధర్, అరుణ బాల్‌రాజ్, రోబో గణేశన్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఆగస్టు 7న రిలీజ్ కాబోతోంది. ఈ కథ డిటెక్టివ్ తీక్షణ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఇన్వెస్టిగేటివ్ కథలను ఇష్టపడేవాళ్ళకి ఇది బెస్ట్ సజెషన్.
9. ఫోటోగ్రాఫర్
అష్రఫ్ అలీ మొహమ్మద్ దర్శకత్వంలో వస్తున్న ఈ తమిళ ఫాంటసీ థ్రిల్లర్ లో అష్రఫ్ అలీ మహమ్మద్, జననీ సమాధానం, కరుణాకరన్, దేవి మహేష్, ఆడుకలం నరేన్, వేల రామమూర్తి వంటి తారాగణం ఉన్నారు. ఆగస్టు 7 న వస్తున్న ఈ మూవీ కథ ఒక ఫోటో గ్రాఫర్ చుట్టూ తిరుగుతుంది. ఒక దట్టమైన అడవిలో అతను మిస్సింగ్ కావడంతో దర్యాప్తు బృందం వెతికే క్రమంలో ఈ కథ ఇంటెన్స్ గా సాగుతుంది.
10. అనకాపల్లి
ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ, సంగీత క్రిష్ నటించారు. ఈ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 7న రిలీజ్ కాబోతోంది. ఒక కోపిష్టి యువకుడు, ఒక అమాయక అమ్మాయి ప్రేమలో పడ్డాక జరిగే సంఘటనలతో ఈ మూవీ సాగుతుంది.
- Tags
- cinema
- Theatre Releases
తాజావార్తలు
-
కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
-
Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
-
Theatre Releases: ఈ వారం థియేటర్లలో సౌత్ జాతర.. హారర్ నుంచి యాక్షన్ వరకు సందడే సందడి!
-
Sachin Tendulkar Fielding: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ జెర్సీలో బరిలోకి దిగిన సచిన్.. ఈ షాకింగ్ విషయం తెలుసా?
-
Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటతో చేతులు గరుకుగా మారాయా? ఇలా చేస్తే మళ్లీ మెత్తబడతాయి.!
-
ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!
-
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్‌తో వచ్చేస్తున్న Neo 11S.!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!