Site icon NTV Telugu

Karthikeya 2: అది ‘కార్తికేయ’ రేంజ్.. శ్రీ కృష్ణుడా మజాకానా

Karthikeya

Karthikeya

Karthikeya 2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్- చందు మొండెటి కాంబోలో వచ్చిన చిత్రం కార్తికేయ 2. గతేడాది రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ హిట్ ను అందుకొని ఒక్కసారిగా నిఖిల్ రేంజ్ ను అమాంతం పెంచేసింది. శ్రీ కృష్ణుడు గురించి సినిమాలో చూపించిన ప్రతి సీన్ కు ప్రేక్షకులు మంత్ర ముగ్దులు అయ్యారు. 100 కోట్ల కలక్షన్స్ తో 2022 లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెర మీద కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది. అది తెలుగులోనే కాకుండా హిందీలో కూడా టాప్ మోస్ట్ వ్యూడ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.

హిందీ బుల్లితెరపై కార్తికేయ 2 పెను సంచలనం సృష్టించింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజిఎఫ్, తరువాత డబ్బింగ్ సినిమాలో కార్తికేయ 2 ఫోర్త్ ప్లేస్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో హిట్ అందుకోవడం అంటే రికార్డు అనే చెప్పాలి. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు సినిమాలో దేవుడు ఉంటే చాలు గుడి కట్టేస్తారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ ను వారు శ్రీ రాముడితో పోలుస్తూ పూజలు కూడా చేసేశారు. ఇక కార్తికేయ సినిమాలో కృష్ణుడు గురించి చెప్పడంతో ఈ సినిమాను కూడా ఎంతో ఆదరించారు. గతేడాది డబ్బింగ్ సినిమాల లిస్ట్ లో కార్తికేయ 2 నాలుగో స్థానంలో ఉండగా.. లైగర్ 5వ స్థానం, రాధే శ్యామ్ ఆరో స్థానాన్ని సంపాదించుకుంది. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని కార్తికేయ 2 నిరూపించిందని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version