డిసెంబరు 8 బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన చాపర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సైనికులు మరణించారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు దేశం మొత్తం సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తోంది. రావత్ వీరమరణానికి చిత్రసీమ కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేసింది. మోహన్‌లాల్, చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దక్షిణాది ప్రముఖులు భారతదేశం అద్భుతమైన ఆర్మీ ఆఫీసర్‌లో ఒకరిని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు తమన్నా భాటియా, ఖుష్బు సుందర్, దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు నివాళులర్పించారు.
Read Also : భారత మొట్టమొదటిగా సీడీఎస్ బిపిన్ రావత్.. సాధించిన ఘనతలు ఇవే !
చిరంజీవి ట్వీట్ చేస్తూ “షాకింగ్, విషాదకరమైన ఛాపర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మా అత్యంత టాప్ మిలిటరీ అధికారి, మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మరియు మరో 11 మంది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. యావత్ జాతికి తీరని నష్టం” అని అన్నారు.
