Site icon NTV Telugu

Hrithika Srinivas: నటి ఆమని మా అత్త.. క్రికెట్ టీంలో ధోనీలా నా పాత్ర!

Hrithika Srinivas

Hrithika Srinivas

Sound Party heroine Hrithika Srinivas Exclusive Web Interview: ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన సౌండ్ పార్టీ, వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకి జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లుగా వ్యవహరించిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు.
ఈ క్రమంలో ఆమె మాలాడుతూ సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేదన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించానని, హీరోయిన్ గా తెలుగులో తనకు ఇది రెండో సినిమా అని అన్నారు. అల్లంత దూరాన తర్వాత నటించిన ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించిందన్నారు. ఈ సినిమాలోకి సిరి అనే పాత్రలో నటించానని, ఆ పాత్ర సినిమాలో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుందన్నారు. క్రికెట్ టీంలో ధోనీలా నా పాత్ర ఉంటుందని డైరెక్టర్ అంటుంటారని, ఎందుకంటే సినిమా క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తానన్నారు. లాస్ట్ లో వచ్చి ధోని ఎలా సిక్స్ లు కొడతారో అలా నా పాత్ర ఉంటుందని సీరియస్ క్యారెక్టర్ అయినా సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుందన్నారు.

Vinod Thomas: ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన మలయాళ నటుడు.. ఏసీనే ప్రాణం తీసిందా?

నా రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఈ పాత్ర ఉంటుందని, అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అన్నారు. సినిమాలో బిట్ కాయిన్ గురించి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మా హీరో సన్నీకి టెలివిజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బిగ్ బాస్ లో ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్ లోనూ ఆయన అలానే ఉంటారు. చాలా జెన్యూన్ గా, ఓపెన్ గా ఉంటారు,సౌండ్ పార్టీ టైటిల్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నటించారు. సెట్ లో సన్నీ చాలా సపోర్ట్ చేశారు,తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రాకపోతే ఆయనే నేర్పించారు. నాకు హీరోయిన్ గా
ఎక్స్పరిమెంట్స్ సినిమాలు చేయాలని ఉందన్న ఆమె హీరోలో నాని అంటే నాకిష్టమని చెప్పుకొచ్చింది.
శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Exit mobile version