Site icon NTV Telugu

చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్‌లో రూ.100 కోట్ల సినిమా

కరోనా సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు ఎఫెక్ట్ చూపించింది. ఇందులో సినిమా రంగం కూడా ఉంది. ముఖ్యంగా ఇండియన్ సినిమాకు బాలీవుడ్ పరిశ్రమ ఆయువుపట్టు లాంటిది. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్‌లో విడుదలైన సినిమాలు ఆదరణ నోచుకోవడంలో విఫలమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఓ సినిమా బాలీవుడ్‌కు ఊపిరి అందించిందనే చెప్పాలి. అదే రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘సూర్యవంశీ’. ఈ మూవీలో దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది.

Read Also: “భీమ్లా నాయక్” రన్ టైమ్ ఎంతంటే ?

అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, రణ్‌వీర్‌సింగ్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలి మూడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో వచ్చే కలెక్షన్లు కలుపుకుంటే ఈ మూవీ రూ.100 కోట్లు దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా తొలి వారంలో ఈ సినిమా రూ.125 కోట్ల మార్కును చేరుకుంటుందని వారు భావిస్తున్నారు. మంచి కమర్షియల్ సినిమా కాబట్టి మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణలోనూ బయ్యర్లకు ‘సూర్యవంశీ’ ప్రాఫిట్ వెంచర్ కానుంది.

Exit mobile version