Site icon NTV Telugu

Sonu Sood: విద్యార్థినిల పర్సనల్ వీడియోలు లీక్.. రియల్ హీరో ఎమోషనల్ ట్వీట్

Sonu

Sonu

Sonu Sood: ఉదయం నుంచి చండీఘర్ హాస్టల్ విద్యార్థినిల ప్రైవేట్ వీడియోస్ లీక్ అంటూ వార్తలు వస్తున్న విషయం విదితమే. ఒక బాలిక తన ఫ్రెండ్స్ ల బాత్రూమ్ వీడియోలను తీసి ఆన్లైన్ లో లీక్ చేసిందంటూ చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిజానిజాలు తెలుసుకుంటున్నారు. మరోపక్క సోషల్ మీడియా నుంచి లీక్ అయిన వీడియోల ఐపీ అడ్రెస్లు, యూట్యూబ్ లింక్స్ ను తొలగించడానికి పోలీసులు పూనుకున్నారు. ఇక ఈ ఘటనపై రియల్ హీరో సోనూ సూద్ స్పందించారు.

“చండీగఢ్ యూనివర్శిటీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మన సోదరీమణులకు అండగా ఉండి బాధ్యతాయుతమైన సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన సమయం ఇది. బాధితులకు కాదు మనకే ఇది పరీక్షా సమయం. బాధ్యతగా ఉండండి.. ” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. “60 మంది విద్యార్థినిల వీడియోలు లీక్ అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి.. కానీ మాకు ఒక్క వీడియోనే లభ్యమయ్యింది. విద్యార్థినిల ఫోన్లు అన్ని మేము స్వాధీనం చేసుకున్నాం.. ఇక్కడ ఏదేదో జరుగుతుందని, వీడియోలు లీక్ అయ్యాయని బాలికలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పూర్తిగా విచారించి మీడియా ముందు తెలుపుతామని” తెలిపారు.

Exit mobile version